ఇదే నిజం, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు ఏఐజీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) హాస్పిటల్ డాక్టర్లు శుక్రవారం ఆయన్ను డిశ్చార్జి చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు. ఏఐజీ నుంచి ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే క్యాటరాక్టు సమస్యకు డాక్టర్లు చంద్రబాబుకు సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల కోసం గురువారం ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు చేరారు. ఏఐజీకి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కె.రాజేష్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం ఆయనకు వివిధ వైద్య పరీక్షలు సూచించినట్లు సమాచారం. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, కాలేయ, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ ఇతర టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న ఆయనకు తీవ్ర అలర్జీ, ఇతర అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ లభించడంతో బుధవారం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.
Homeహైదరాబాద్latest NewsChandrababu discharged from AIG Hospital AIG హాస్పిటల్ నుంచి ChandraBabu డిశ్చార్జి