ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. ఏపీలో ధాన్యం సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు తమకు ఇష్టమైన మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రవాణా వాహనాలు, గోనె సంచులు సమకూర్చాలని, లేబర్ ఛార్జీలను చెల్లించాలని అధికారులకు సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, రవాణా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలన్నారు.