పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. అనుభవజ్ఞుడైన నాయకుడు, నిరంతం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అంకితమైన నేత అని కొనియాడారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. రాజకీయంగా, పరిపాలనా పరంగా చంద్రబాబు అనుభవజ్ఞులని జనసేన అధినేత పవన్ కొనియాడారు.‘నిరంతరం రాష్ట్రం గురించే చంద్రబాబు ఆలోచిస్తారు. వైసీపీ పెట్టిన కేసులతో జైల్లో ఉన్నా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు’అని పవన్ తెలిపారు. అహర్నిశలు ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబునాయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో పోస్టు చేశారు.