హైడ్రా వెనక ఉన్నదే చంద్రబాబు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడినుండి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నాడని ఆరోపించారు. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకు వచ్చారని మండిపడ్డారు. ఇది అంత ఒక పెద్ద కుట్ర అని.. రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్ కాకుండా చేస్తున్నాడని ఆరోపించారు.