– మూడు బెయిల్ పిటిషన్లు డిస్మిస్
ఇదేనిజం, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ లో ఉన్నందున హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
లంచ్ బ్రేక్ తర్వాత ఏసీబీ కోర్టు తీర్పు
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడి పిటీషన్ పై లంచ్ బ్రేక్ తర్వాత తీర్పు రానున్నది. లంచ్ బ్రేక్ తర్వాత రెండు పిటీ వారెంట్లపై విచారణ జరిగే అవకాశం ఉంది.
Read More:
Chandrababu Naidu క్వాష్ పిటిషన్ వాయిదా
http://idenijam.com/chandrababu-naidu-cash-petition-postponed