Homeహైదరాబాద్latest Newsచంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల కానున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు. వాటిపై నీకు గౌరవం ఉంటే.. 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం హామీని ఎందుకు నెరవేర్చలేదని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతామని చంద్రబాబు అన్నారు. కానీ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి ఓట్లు అడుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Recent

- Advertisment -spot_img