– 17 ఏ నిబంధనలను ప్రస్తావించిన హరీశ్ సాల్లే
– మంగళవారం వాదన వినిపించనున్న ముకుల్ రోహత్గీ
ఇదేనిజం, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17ఏ లోని నిబంధనలను ఒక్కొక్కటిగా బెంచ్ ముందు హరీశ్ సాల్వే పెట్టారు. దీంతో మీ క్లయింట్ కేసులో 17ఏ వర్తించే అవకాశాలు ఉన్నాయని జస్టిస్ అనిరుద్ధబోస్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తిరిగి వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ కోరారు. దీంతో రోహత్గీ అభ్యర్థనకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
Chandrababuకు నిరాశ
http://idenijam.com/chandrababu-is-disappointed
హైకోర్టులో నిరాశ
– మూడు బెయిల్ పిటిషన్లు డిస్మిస్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ లో ఉన్నందున హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడి పిటీషన్ ఏసీబీ కోర్టు కొట్టేసింది.