Homeఫ్లాష్ ఫ్లాష్Chandrababu Naidu : నన్ను చంపేందుకు కుట్ర

Chandrababu Naidu : నన్ను చంపేందుకు కుట్ర

– నా ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు
– ఏసీబీ న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ

ఇదేనిజం, ఏపీ బ్యూరో: తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాజమండ్రి సెంట్రల్​ జైలు నుంచి ఏసీబీ న్యాయమూర్తికి లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ మేరకు 3 పేజీల లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు. తాను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు తీశారని ఆరోపించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో విడుదల చేశారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని.. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందని.. అయినప్పటికీ పోలీసులు విచారణ చేపట్టలేదని లేఖలో ప్రస్తావించారు. మరి చంద్రబాబు లేఖ మీద న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img