HomeరాజకీయాలుChandrababu remand extended in skill development case Skill Development Caseలో చంద్రబాబు రిమాండ్...

Chandrababu remand extended in skill development case Skill Development Caseలో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

– నవంబర్​ 1వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చిన ఏసీబీ కోర్టు

ఇదే నిజం, ఏపీ బ్యూరో: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్‌ నేటితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌ను నవంబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు వెల్లడించింది. జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని ఆయనకు జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా తీశారు. ఆయన మెడికల్‌ రిపోర్టులను అందివ్వాలని ఆదేశించారు.
నవంబర్‌ 1వ తేదీ వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ పొడిగిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో తన ఆరోగ్యం, భద్రత గురించి జడ్జి ఎదుట చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Recent

- Advertisment -spot_img