Homeహైదరాబాద్latest Newsచంద్రబాబు హైదరాబాద్‌లో ఫార్ములా రేసు కోసం ప్రయత్నించారు : కేటీఆర్‌

చంద్రబాబు హైదరాబాద్‌లో ఫార్ములా రేసు కోసం ప్రయత్నించారు : కేటీఆర్‌

ఫార్ములా కార్‌ రేసును హైదరాబాద్‌ తెచ్చేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి అని కేటీఆర్‌ తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ పక్కన గోపనపల్లిలో ఫార్ములా 1 రేస్ ట్రాక్ కోసం 580 ఎకరా భూసేకరణకు నోటీసులు ఇచ్చారు అని అన్నారు. అది పూర్తి అయ్యేలోపే ఆయన ఓడిపోయారు. అయితే గోపనపల్లిలో ఎవరైతే రైతులు భూసేకరణ నోటీసులు తీసుకున్నారో వాళ్లు ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నారు వారిలో రేవంత్ రెడ్డి కూడా ఒకడు అని కేటీఆర్‌ తెలిపారు. రేవంత్ రెడ్డికి కూడా అక్కడ 15 ఎకరాల భూమి ఉంది.. అది ఆయన గుంజుకున్నాడో, లేక నిజంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో నాకు తెలీదు కానీ ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో చూపించాడు కేటీఆర్ అన్నారు.ఎ లక్ట్రిక్ వాహనాల హబ్‌గా తెలంగాణ అని ప్రపంచం మాట్లాడుకోవాలానే అజెండాతో రేస్‌కి ఒప్పందం చేశాం అని కేటీఆర్ వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img