సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2014-19లో అందరూ ప్రభుత్వంలో ఉండటంతో పార్టీ తీవ్రస్థాయిలో నష్టపోయింది. దీంతో ఈసారి అటువంటి పరిస్థితి ఉండకూడదని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పలువురు సీనియర్లకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసే విధంగా త్వరలో కమిటీ వేయనున్నట్లు సమాచారం.