ఇదేనిజం, హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఆయన బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏఐజీ వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. వారి సూచన మేరకు గురువారం చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.