మెగాస్టార్ చిరంజీవి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో జీవితంలో చిరంజీవి మాట్లాడుతూ.. మనం జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతూనే ఉంటారు. టాలెంట్ ఉంది కదా మనకు సక్సెస్ వస్తుంది కదా అని కాలర్ ఎగరేస్తే.. మన భవిష్యత్తుకే ప్రమాదం అని అన్నారు. టాలెంట్ తో పాటు సరైన క్యారెక్టర్ కూడా ఉండాలి బాబు అని చిరంజీవి తెలిపారు. జీవితంలో ఎదగాలంటే ప్రతిభ ఎంత ముఖ్యమో క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం అని అన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హీరో అల్లు అర్జున్ ను ఉందేశించి చిరంజీవి ఇలా మాట్లాడారు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.