ఎలాన్ మస్క్ సరికొత్త ఆవిష్కరణతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఎలాన్ మస్క్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నాడు. ఆ ఫోన్‌కు ఇంటర్నెట్ అవసరం లేదని, ఛార్జింగ్ కూడా అవసరం లేదని ప్రచారం జరుగుతుంది. అసలు ఈ ఫోన్ ఛార్జింగ్, ఇంటర్నెట్ లేకుండా ఎలా పని చేస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు ఈ వార్తల్లో నిజమెంతో తెలుసుకుందాం. టెస్లా 2021 నుండి స్మార్ట్ ఫోన్‌ల తయారీ వ్యాపారంలోకి వస్తోందని పుకారు ఉంది, అయితే ఇప్పటివరకు టెస్లా నుండి స్మార్ట్ ఫోన్‌లు రాలేదు. స్మార్ట్ ఫోన్లను తయారు చేసే ఆలోచన తనకు లేదని ఎలోన్ మస్క్ ప్రకటించాడు.అయితే టెస్లా పీఐ మూడు అసాధారణ ఫీచర్లతో రానుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఫోన్‌కు ఇంటర్నెట్ అవసరం లేదని, నేరుగా స్పేస్‌ఎక్స్ శాటిలైట్‌తో పనిచేస్తుందని, సోలార్ సిస్టమ్ ద్వారా ఆటో ఛార్జింగ్ అవుతుందని ప్రచారం మొత్తం బూటకమని తేలింది.