Pudina uses : పుదీనాలో రోస్మరిక్ యాసిడ్‌తో పాటు ఫ్లవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. పుదీనాలో ఉన్న విటమిన్ సీ వంటి యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిక్ రోగుల్లో ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడటానికి సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అధికంగా తీసుకోకుండా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అలెర్జీ, మంట నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. తాజాగా, చిన్నగా ఉన్న ఆకులతో ఉన్న పుదీనా తీసుకుంటే బెటర్.