Homeహైదరాబాద్latest Newsమియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ : Hyderabad

మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ : Hyderabad

– ఓ స్కూల్​లో రూ.7.85 లక్షల చోరీ

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చెడ్డీ గ్యాంగ్‌ సంచారం కలకలం రేపుతోంది. హఫీజ్‌పేట్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో శనివారం అర్ధరాత్రి కొందరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. చెడ్డీలు ధరించి మారణాయుధాలతో వచ్చిన వీరు.. స్కూల్ కార్యాలయంలోని కౌంటర్‌లో రూ.7.85 లక్షల క్యాష్​ను దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img