హైదరాబాద్, ఇదేనిజం : అనారోగ్య కారణంతో నగరంలోని జంతు ప్రదర్శనశాల(నేహ్రు జుపార్కు)లో ఉన్న ఆఫ్రీకన్ హీబా చిరుత (ఆడ)(8 సం), మృతి చెందినదని జూపార్కు అధికారులు సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. సౌదీఆరెబియా దేశానికి చెందిన వ్యక్తులు ఒక జత (ఆడ, మగ)(హీబా–అబ్దులా) చీతాలను మన జూపార్కుకు ఇచ్చారు. అయితే గత కొన్ని నెలల నుంచి ప్యార ప్రేలేగియా అనే వ్యాధి సోకడంతో మృతిచెందింది. దీంతో రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ పశు వైద్య కళశాల ఫ్రోఫెసర్ డాక్టర్ లక్ష్మన్, జూపార్కు డాక్టర్ ఏం.ఏ హాకీం బృందం పోస్ట్మార్టం నిర్వహించారు.