Homeహైదరాబాద్latest NewsIPL : రాజస్థాన్‌పై చెన్నై విజయం

IPL : రాజస్థాన్‌పై చెన్నై విజయం

ఐపీఎల్ 2024 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్థాన్ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రచిన్ రవీంద్ర 18 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 41 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 42పరుగులతో రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా యంగ్ బౌలర్ సిమర్జీత్ సింగ్ నిలిచాడు. 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

13 మ్యాచుల్లో 7 విజయాలు సాధించిన చైన్నై 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఆర్‌ఆర్‌తో జరిగిన చివరి 5 మ్యాచుల్లో వరుసగా 4 పరాజయాల తర్వాత చెన్నైకి ఇదే మొదటి విజయం. X లో CSK పోస్టును చూసి, మ్యాచ్ తర్వాత Surprise ఏదో ఉంటుందని అంతా అనుకున్నా..అటువంటి ప్రకటన ఏమీ చెన్నై టీం చేయలేదు.

Recent

- Advertisment -spot_img