Homeజిల్లా వార్తలుచెరువు చెంతనే.. చెత్తా చెదారం..!

చెరువు చెంతనే.. చెత్తా చెదారం..!

ఇదేనిజం, నల్లబెల్లి: వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం, నందిగామ గ్రామంలో ప్రధాన చెరువు అయినా ఊరు చెరువులో గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా సేకరించిన చెత్తను చెరువులో వేస్తున్నారు. వేసిన చెత్తను కాలపెట్టడం వలన దాని నుండే వెలవడే వ్యర్థ పదార్థాల వాసన వలన చెరువు కాలనీ వాసులకు దగ్గర ఉండడంతో కాలనీవాసులు దాని నుండి వెలవడే వాసన వలన శ్వాస కోసం వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది అంతేకాకుండా చెరువులో చెత్త వేయడం వల్ల చెరువులో మత్స్యకారులు పెంచుకుంటున్న చాప పిల్లలు కూడా రోగాల బారిన పడుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు.

చెరువులో చెత్త వేయొద్దని కాలనీ వాసులు గ్రామపంచాయతీ కార్యదర్శిని అడగగా గ్రామంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ లేనందున చెరువులో పోస్తున్నామని పోసిన చెత్తను వెంటనే కాల్చి చేస్తున్నామని తెలిపారు. నిత్యం పొలాలకు వెళ్లే రైతులు వ్యవసాయ కూలీలు చెత్త వాసనకు ఇబ్బంది పడుతున్నార తెలంగాణ పండుగలలో ఒకటైన బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు ఇట్టి పండుగకు సంబంధించి మహిళలు చెరువు కట్టపై బతుకమ్మలు ఆడుతారు.

ఈ దుర్వాసన వలన బతుకమ్మలు ఎలా అడగలమని మహిళలు వాపోతున్నారు…! కాలనీ వాసులు చెత్త వేయడం ఆపేయాలని ఎమ్మార్వో కు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. చెరువులో చెత్త వేస్తే అరికట్టాల్సిన గ్రామపంచాయతీ చెత్త వేయడం ఏంటని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు ఇప్పటికైనా ఎంపీడీవో ఎంపీడీవో, సంబంధిత అధికారులు స్పందించి చెత్తను వేరేచోట వేయగలరని రైతులు వ్యవసాయ కూలీలు మత్స్యకారులు కాలనీవాసులు కోరుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img