Homeస్పోర్ట్స్చెస్‌ ఒలింపియాడ్‌ ఫైనల్.. సర్వర్​ డౌన్​.. ఓడి గెలిచిన ఇండియా

చెస్‌ ఒలింపియాడ్‌ ఫైనల్.. సర్వర్​ డౌన్​.. ఓడి గెలిచిన ఇండియా

న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య చెస్​ ఒలింపియాడ్‌ ఫైనల్లో ఇండియా గోల్డ్​ మెడల్​ సాధించింది. కరోనా నేపథ్యంలో తొలిసారి ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌ ఫైనల్లో రష్యాతో కలిసి గోల్డ్ మెడల్​ని పంచుకోవాల్సి వచ్చింది. రష్యాతో జరిగిన ఫైనల్లో భారత్ చెస్ మాస్టర్స్ నిహల్ సరిన్, దివ్యా దేశ్ ముఖ్‌లు హోరాహోరిగా పోరాడుతున్న సమయంలో సర్వర్ డౌన్​ అయ్యింది. దీంతో వారు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నిరాశకు గురైనా వీరు స్పోర్ట్ అథారీటికి జరిగిన టెక్నికల్​ ఇష్యూస్​ను వివరించారు. భారత అధికారులు ఫిడేకు అప్పీల్ చేయడంతో రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు. నిహాల్‌ సరీన్‌, దివ్య దేశ్‌ముఖ్‌లు గెమ్ ఆడుతున్న సమయంలో సర్వర్ అంతరాయాల కారణంగా పత్యర్ధి ఎసిపెంకోతో గేమ్‌ను డ్రా చేసుకొనే పరిస్థితుల్లో ఉన్న నిహల్​ సరీన్‌ ఓటమి చెందారు. షువలోవాతో జరిగిన మరో మ్యాచ్‌లో కూడా సాంకేతిక సమస్య కారణంగా దివ్వ దేశ్​ముఖ్​ కూడా ఓటమి పాలైంది. కోనేరు హంపి కూడా వీరి తరహలోనే టేక్నికల్ సమస్యలు ఎదురుకున్నారు. ఈ కారణంగా భారత ఆటగాళ్ళు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img