చెస్ ఒలింపియాడ్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది. టోర్నీలో భారత్ తొలిసారి పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఓపెన్ సెక్షన్‌లో భారత్ మరో రౌండ్ మిగిలుండగానే 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా చెస్ ప్లేయర్ ఫాబియానో కురువాను ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ఓడించాడు. దాంతో దొమ్మరాజు గుకేశ్ నవంబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు.