ఇదే నిజం, చేవెళ్ల : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన రేపు(బుధవారం) చేవెళ్ల (Chevella) నియోజకవర్గంలోని నవాబ్ పేట్ మండల కేంద్రంలో ఉదయం 11గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ చేవెళ్ల మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైతు దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తక్ రెడ్డి, బీఆర్ఎస్ తదితర సీనియర్ నాయకులు రానున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై రైతు దీక్షను విజయవంతం చేయాలని కోరారు.