పశ్చిమగోదావరి జిల్లా అశ్వారావుపేట రోడ్డులో శనివారం ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవంతో పాటు దసరా కానుకగా రూ.3కే చికెన్ బిర్యానీ అందిస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దాంతో రెస్టారెంట్‌కు భోజనప్రియులు భారీగా క్యూ కడుతున్నారు. దీనితో పాటు రూ.290 ధరకు ఒక వ్యక్తి తిన్నంత బిర్యానీ, రూ.380 ధరకు ఒక వ్యక్తి నిర్ణీత నాలుగు రకాల స్టార్టర్ ఐటెమ్స్‌లో ఏవైనా ఎంతైనా తినవచ్చు. రూ.580 ధరకు ఇద్దరు వ్యక్తులకు మెనూలో ఉన్న 30 రకాల ఫుడ్ ఐటెమ్స్ ఎంతైనా తినవచ్చు. ఒక వ్యక్తి రూ.680 ధరకు రెస్టారెంట్ లో 400 రకాల ఐటెమ్స్‌లో ఏవైనా ఏంతైనా తినవచ్చు. మరో వంద అదనంగా చెల్లిస్తే 20 రకాల మాక్టైల్స్, కూల్‌డ్రింక్స్ ఎన్నైనా తాగవచ్చని నిర్వాహకులు ప్రకటించడంతో భోజనప్రియులు లొట్టలు వేస్తున్నారు.