Chicken prices: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ ధరలు గణనీయంగా తగ్గాయి, వినియోగదారులకు ఊరటనిస్తున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.170 నుంచి రూ.180 వరకు ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.190 నుంచి రూ.200 మధ్యలో విక్రయిస్తున్నారు. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్‌లో విత్ స్కిన్ చికెన్ కేజీ రూ.170-180 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.200 నుంచి రూ.210 వరకు ఉంది.
ఇక గుడ్ల ధరల విషయానికి వస్తే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో డజన్ కోడి గుడ్ల ధర రూ.78గా స్థిరంగా ఉంది. ఈ ధరల తగ్గుదలతో కోడి మాంసం, గుడ్లు కొనుగోలు చేసే వారికి ఆర్థిక భారం కొంత తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. ఈ మార్పులు మార్కెట్‌లో సరఫరా పెరగడం, డిమాండ్ స్థిరంగా ఉండటం వల్ల సంభవించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.