Homeజాతీయంజీడీపీ వృద్ధి రేటు త‌గ్గేందుకు దేవుడు కార‌ణ‌మా..

జీడీపీ వృద్ధి రేటు త‌గ్గేందుకు దేవుడు కార‌ణ‌మా..

ఆర్థిక మంత్రి వ్యాఖ్య‌ల‌పై చిదంబ‌రం ఆగ్ర‌హం
న్యూఢిల్లీః కరోనా వల్లనే జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది… ఇది దేవుని చర్య అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ తప్పిదాన్ని దేవుడి మీదకు నెట్టకూడదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని ఒక జోక్‌గా వర్ణించారు చిదంబరం. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం అన్నారు. 2013లో చిదంబ‌రం ఆర్థిక మంత్రి ఉన్న స‌మ‌యంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న‌సమయంలో చేసిన ఓ ట్వీట్‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు‌ చేశారు. దీనికి సంబంధించిన‌ స్క్రీన్‌ షాట్‌ను తాజాగా చిదంబరం పోస్ట్ చేసి.. విమర్శలు గుప్పించారు. అప్ప‌టి ట్విట్‌లో ‘దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలో చిక్కుకుందని, యువతకు ఉద్యోగాలు కావాల‌ని, సమయాన్ని అనవసర రాజకీయ చర్యలకు కాకుండా ఆర్థికవ్యవస్థను బాగు చేసేందుకు కేటాయించాలని’ మోదీ అన్నారు. దానినే చిదంబరం గుర్తు చేస్తూ తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది ఇదే అంటూ విమర్శలు చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img