Homeజిల్లా వార్తలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.. రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.. రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం..

ఇదే నిజం – మెట్ పల్లి టౌన్: మెట్ పల్లి పట్టణంలో బస్ డిపో చౌరస్తా వద్ద గురువారం పట్టణ రైతు మిత్ర కాంగ్రెస్ సంఘం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర రైతులకు రైతు రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి రైతు మిత్ర కాంగ్రెస్ సంఘం తరఫున పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ఇన్నేళ్ల పాలనలో ఏ ప్రభుత్వం చేయని రైతు రుణ మాఫీ 2 లక్షల రూపాయలు ఏక మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వల్లె సాధ్యం అయిందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు మిత్ర కాంగ్రెస్ సంఘ అధ్యక్షులు పొట్ట రాజేశ్వర్, నీరేటి రవీందర్, సోమిడి శివకుమార్, బత్తుల దీక్షిత్, భూమయ్య ,పొట్ట ప్రసాద్, బూరo ఆంజనేయులు, పొట్ట మోహన్, సోమిరెడ్డి మహేందర్, గోరువంతులు మారుతి, పొట్ట ప్రేమ్, సోమిరెడ్డి రాజారాం, బత్తుల నరేష్, నేరెళ్ల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img