Homeహైదరాబాద్latest Newsనేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. !

నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. !

ఇదినిజం, ఏలూరు జిల్లా: బుధవారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 11.10 హెలికాప్టర్ లో ఏలూరు సి ఆర్ రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు. అనంతరం,11. 25 కు తమ్మిలేరు బ్రిడ్జికి చేరుకొని వరద పరిస్థితిని పరిశీలించి ,11:45 కు సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియం చేరుకుంటారు. అక్కడ రైతులు వరద బాధితులతో మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 12:30 కు సి ఆర్ రెడ్డి కళాశాల హెలిపాడ్ కు చేరుకొని హెలికాప్టర్లో సామర్లకోట వెళ్తారు.

Recent

- Advertisment -spot_img