Child Health : స్కూల్ పిల్లల్లో తీవ్ర తలనొప్పి సమస్య
Child Health : స్కూల్ విద్యార్థుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ పాఠాలు విన్న పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.
ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు ఇంట్లో సరైన పరిస్థితులు లేకపోవడం, పరీక్షలు, కొవిడ్-19 గురించి ఆందోళనలు తలనొప్పి లక్షణాలు తీవ్రతరం కావడం, కొత్తగా తలనొప్పి రావడానికి కారణాలని పరిశోధకులు గుర్తించారు.
టర్కీలోని కరామన్‌లోగల ఎర్మెనెక్ స్టేట్ హాస్పిటల్ ప్రధాన పరిశోధకుడు ఐసే నూర్ ఓజ్‌డాగ్ అకార్లీ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు.
10 – 18 ఏళ్ల మధ్య వయస్సు గల 851 మందిపై పరిశోధన చేశారు.
ఈ అధ్యయన కాలంలో 756 మంది తలనొప్పితో బాధపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఇందులో పది శాతం మంది పిల్లలు పాండమిక్ సమయంలో కొత్తగా తలనొప్పి బారినపడ్డట్లు తేల్చారు.
నాలుగో వంతు (27 శాతం) మంది పిల్లలు తమ తలనొప్పులు తీవ్రమయ్యాయని, 61 శాతం మంది తమ తలనొప్పులు స్థిరంగా ఉన్నాయని, 3 శాతం మంది తమ తలనొప్పి మెరుగుపడిందని చెప్పినట్లు పరిశోధకులు తెలిపారు.
కొత్తగా తలనొప్పిబారినపడ్డవారు నెలకు సగటున 8-9 సార్లు దీంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
ఈ సమూహంలోని సగం మంది పిల్లలు (43 శాతం), స్థిరమైన సమూహంలో మూడో వంతు (33 శాతం)తో పోలిస్తే కనీసం నెలకు ఒకసారి తలనొప్పి నివారణ మందులను ఉపయోగించారు.
మానసిక ఆరోగ్యం, పాఠశాల విజయాలపై తలనొప్పి పెద్ద ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనం కనుగొంది.