Homeహైదరాబాద్latest Newsఅంబులెన్స్‌లోనే సుఖప్రసవం

అంబులెన్స్‌లోనే సుఖప్రసవం

ఇదే నిజం, జోగిపేట : 108 అంబులెన్స్ వాహనంలోనే మహిళ ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే జోగిపేట కు చెందిన 108 వాహనం అందుబాటులో ఉండడంతో స్పందించారు. గ్రామానికి చేరుకొని మంజులను డెలివరీ నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు వాహనంలో ఎక్కించుకున్నారు. మార్గమధ్యమంలోకి రాగానే నొప్పులు ఎక్కువ కావడంతో వాహనంలోనే సిబ్బంది డెలివరీ చేశారు. దీంతో ఆడబిడ్డ జన్మించింది. తల్లి బిడ్డలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డలు ఆరోగ్యం గానే ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. 108 వాహనం ఈ ఆర్ సి పి డాక్టర్ హబీబ్, ఈఎంటి ఎం శ్రీనివాస్, పైలట్ కృష్ణమూర్తిలను కుటుంబ సభ్యులు అభినందించారు. సకాలంలో వైద్యం చేయడంతో తల్లి బిడ్డలకు ప్రాణాపాయం తప్పిందని 108 సిబ్బంది తెలిపారు.

Recent

- Advertisment -spot_img