Homeహైదరాబాద్latest Newsఫోన్లకు బానిసలవుతున్న చిన్నారులు.. ఫోన్ వాడకుండా నియంత్రించడానికి వ్యూహాలివే..!

ఫోన్లకు బానిసలవుతున్న చిన్నారులు.. ఫోన్ వాడకుండా నియంత్రించడానికి వ్యూహాలివే..!

నేటి తరం పిల్లలు సెల్‌ఫోన్లకు చాలా అడిక్ట్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో చిన్నారులు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ స్మార్ట్‌ఫోన్‌ చూడటం వారికి బాగా అలవాటైపోయింది. వారు భోంచేయాలన్నా, చెప్పిన మాట వినాలన్నా వారికి ఫోన్ ఇవ్వాల్సిందే. ఒక ఇంట్లో పెద్దల దగ్గర నుంచి పసిపిల్లల వరకూ అందరి వేళ్లు టచ్‌స్క్రీన్‌పైనే ఉంటున్నాయి. మాట్లాడటానికి, డబ్బు లావాదేవీలకు, వినోదానికి, కాలక్షేపానికి.. ఇలా అన్ని అంశాలతో సెల్‌ఫోన్‌ ముడిపడిపోయింది. స్మార్ట్‌ఫోన్‌ అనే పరికరం పిల్లలకు సాంకేతికతను దగ్గర చేస్తూనే.. వారిలో సైబర్‌ వ్యసనాన్నీ పెంచేస్తోంది. చిన్నతనంలోనే పిల్లలకు ఫోన్లను పెద్దలే అలవాటు చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ చిన్నారులను ప్రమాదపుటంచుల్లోకి నెట్టేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలు ఫోన్ వాడకుండా నియంత్రించడానికి వ్యూహాలు
పిల్లలు క్రీడలు, వ్యాయామ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయాలి. సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించాలి. చిత్రలేఖనం, పుస్తక పఠనం లాంటి ఆసక్తులను పెంపొందించాలి. డిజిటల్‌ పరికరాల నుంచి ఒకేసారి దూరం చేయకుండా క్రమేపీ విరామ సమయాన్ని పెంచుతూ వెళ్లాలి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తరచూ బహిరంగ సంభాషణలకు అవకాశం కల్పించాలి. ఆరోగ్యకరమైన డిజిటల్‌ జీవనశైలిని ఏర్పాటు చేసుకునే వ్యూహాలను రూపొందించాలి.

Recent

- Advertisment -spot_img