వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇవాళ మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు కాస్త తగ్గాయి. తేజ మిర్చి క్వింటా ధర రూ.20,000 ఉండగా.. 341 మిర్చి రకం క్వింటాకు రూ.16,500 వరకు ధర పలుకుతోంది. అలాగే వండర్ హాట్ కొత్త మిర్చి ధర రూ.20,000 పలుకుతోంది. మిర్చికి రేటు తక్కువగా ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.