China : చైనా (China) కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ కంపెనీ తమ కంపెనీ ఉద్యోగులకు వార్షిక బోనస్ గా రూ.70 కోట్లు ఇచ్చింది. ఒక టేబుల్ పై రూ.70 కోట్లు ఉంచి 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత మీదే అని ప్రకటించింది. అయితే 60 నుంచి 70 మీటర్ల టేబుల్ పై ఈ మొత్తాన్ని ఉంచి ఉద్యోగులను 30 టీమ్స్ గా డివైడ్ చేసింది. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మాత్రమే వచ్చి 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడతారో అంత ఆ టీమ్ తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.