Homeఅంతర్జాతీయంపంది మెదడుకు చిప్​ అనుసందానం...

పంది మెదడుకు చిప్​ అనుసందానం…

మానవ మెదడుపై ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. టెక్నాటజీని మెదడుకు అనుసందానించి అద్బుతాలు సృష్టించాలని అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భవిష్యత్​లో మానవుల మెదడుకు అదనపు హంగులను చేర్చే క్రమంలో జంతువులపై ముందుగా ఆ  ప్రయోగాలను చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్టప్ న్యూరాలింక్ ఒక పంది మెదడులో నాణెం పరిమాణంలో ఉన్న కంప్యూటర్ చిప్‌ను అమర్చింది. జెర్‌ట్రూడ్ అనే ఆ పంది మెదడులో చిప్ అమర్చినట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు.

మిషన్ ఇంటర్‌ఫేస్‌తో మెదడును రూపొందించాలన్నది తమ ఆలోచన అని మస్క్ చెప్పారు. ఇలాంటి ఇంటర్‌ఫేస్ సహాయంతో మెదడు నేరుగా ఫోన్లను, కంప్యూటర్లను నియంత్రించే వీలు కలుగుతుంది.  అంతేకాదు.. డిమెన్షియా, పార్కిన్షన్ వంటి వ్యాధులను నయం చేయడానికీ ఇలాంటి చిప్‌లు తోడ్పడతాయని ఎలాన్ మస్క్ అంటున్నారు. పంది మెదడులో అమర్చిన చిప్ నాడీ చర్యలను సూచిస్తూ వైర్ లెస్ సంకేతాలను పంపిస్తుంది. మరికొన్నాళ్ల పాటు ఈ ప్రయోగాలను చేయనున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img