Homeహైదరాబాద్latest NewsChiranjeevi : ఆరోజే మెగా అప్డేట్.. ఇక రూమర్స్కు చెక్..!!

Chiranjeevi : ఆరోజే మెగా అప్డేట్.. ఇక రూమర్స్కు చెక్..!!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరిలో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా వాయిదా పడింది. మే నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు కానీ ఇంకా vfx పనులు పూర్తి కాకపోవడంతో రావడం కష్టమే అని తెలుస్తుంది. ఇప్పటికే Mega157 చర్చనీయాంశంగా మారడంతో.. అసలు ”విశ్వంభర” సినిమా విడుదల గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే వస్తున్న రూమర్స్ ను గమనించిన చిత్రబృందం శ్రీరామ నవమి సందర్భంగా కొత్త అప్‌డేట్‌ను అభిమానులు కోసం ఇవవనున్నారు అని సమాచారం. UV క్రియేషన్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Recent

- Advertisment -spot_img