Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ కోసం చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకోనున్న చిరంజీవి..!

అల్లు అర్జున్ కోసం చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకోనున్న చిరంజీవి..!

చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసుల అరెస్ట్ చేసారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్‌ను కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. బన్నీని హఠాత్తుగా అరెస్ట్ చేయడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా షాక్ అయ్యారు. అయితే ఈ వార్త తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‏కు చేరుకోనున్నారు. ఇవాళ జరుగుతున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌ రద్దు చేసుకుని చిరంజీవి చిక్కడపల్లి పీఎస్‌కు వస్తున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img