పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కల్యాణ్‌కు అన్నయ్య చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘నీ విజయాన్ని చూసి ఒక అన్నగా గర్వపడుతున్నా. నువ్వు గేమ్ ఛేంజర్‌వి మాత్రమే కాదు, మ్యాన్ అఫ్ ది మ్యాచ్‌వి. నిన్ను కొనియాడుతుంటే హృదయం ఉప్పొంగుతోంది. నీ త్యాగం గొప్పది. ఈ అద్భుత ప్రజా తీర్పు నిన్ను దేశం, రాష్ట్రం కోసం మరింత పని చేసేలా చేస్తుందని అశిస్తున్నా. ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని కోరుకుంటున్నా’అని ట్విటర్ వేదికగా స్పందించారు.