ఇదే నిజం, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో అక్కడున్న సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డు కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీఐడీ అధికారులు కౌంటరు దాఖలు చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువురిని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని చంద్రబాబు తరఫు న్యాయవాది గత విచారణ సందర్భంగా వాదించారు. దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు.. పలువురిని సంప్రదిస్తుంటారని సీఐడీ తరఫు న్యాయవాది గతంలో కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో అధికారుల కాల్‌డేటా ఇవ్వడం గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది అన్నారు. ఇదే విషయాన్ని కౌంటర్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.