Homeహైదరాబాద్latest Newsతెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం.. ఈటలకు అధ్యక్ష పదవి అంటూ ప్రచారం.. కానీ పార్టీ సీనియర్లంతా డీకే...

తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం.. ఈటలకు అధ్యక్ష పదవి అంటూ ప్రచారం.. కానీ పార్టీ సీనియర్లంతా డీకే అరుణ వైపే మొగ్గు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో :తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం మొదలైనట్టు కనిపిస్తోంది. పైకి కనిపించకపోయినా ఆ పార్టీలో కోల్డ్ వార్ సాగుతోంది. ఈటల రాజేందరు అధ్యక్ష పదవి ఇస్తారన్నా ఊహాగానాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కిషన్రెడ్డికి, బండి సంజయ్ కి కేంద్ర మంత్రులుగా అవకాశం రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతున్నదన్నది ఆసక్తి కరంగా మారింది. ఇటీవల ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలవడంతో ఆయనే కొత్త అధ్య క్షుడంటూ జరుగుతున్న ప్రచారం మరింత ఊపం దుకున్నది. ఈటల పేరు తొందర్లోనే ప్రకటిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ తెలంగాణ బీజేపీలో చిచ్చు రాజుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ మూడు చీలికలు. ఆరు పేలికలుగా మారిపోయింది.

ఈటలకు వ్యతిరేక స్వరాలు…
బీజేపీలో మెల్లగా ఈటల రాజేందర్ కు వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ వామ పక్ష పార్టీల్లో పనిచేసిన నేత, బీజేపీలో చేరినా ఇక్కడి సిద్ధాంతాలు, విధానాలు ఆయనకు వంటబట్టలేదు. ఆయన నోటి నుంచి జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై లాంటి నినాదాలు వినడం అత్యంత అరుదు. మెడపై కాషాయ కండువా తప్ప.. గుండె నిండా కాషాయ భావన ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతుం టారు. పైగా ఆయన కష్టకాలంలో బీజేపీలోకి వచ్చి ఆ పార్టీని ఉద్దరించిందేమీ లేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు పంపబడి.. పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆత్మరక్షణ కోసం బీజేపీని ఆశ్రయించాడు. అందుకే బీజేపీ హార్డ్ కోర్ కేడర్ ఆయన వెంటలేదు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిండం లేదు.

చేరికల కమిటీ చైర్మన్ గా చేర్చింది ఎందరిని?
ఇక ఈటల రాజేందర్ కు బీజేపీ అధిష్ఠానం పెద్ద బాధ్యత తలమీద పెట్టింది. వివిధ రాజకీయ పార్టీ ల్లోని అసంతృప్తులను బీజేపీలో చేర్పించి.. పార్టీని ఐలోపేతం చేసే బాధ్యత అప్పగించింది. కానీ ఈటల చేసింది శూన్యం. ఈయన చేరికల కమిటీ చైర్మన్ అయ్యాక… కీలక నేత ఒక్కరంటే ఒక్కరు కూడా పార్టీలో చేరలేదు. ఇదిలా ఉంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఐండి సంజయ్ తో ఈటలకు తీవ్ర విబేధాలు ఉన్నాయి. బండిని అధ్యక్ష పోస్ట్ నుంచి తప్పించడంలో ఈటల పాత్ర ఉందని.. బండి అభిమానులు ఇప్పటికీ నమ్ముతుంటారు. అందుకే ఈటల అధ్యక్షుడిగా ఉండ టాన్ని వాళ్లు అసలు ఒప్పుకోవడం లేదు.

బీసీ కార్డు మీదే ఈటల ఆశలు
బీజేపీలోని సీనియర్ నేతలందరూ ఈటల రాజేందర్ కాకుండా డీకే అరుణ కు మొగ్గు చూ పుతున్నట్టు సమాచారం. ఈటల రాజేందర్ వస్తే విభజించు.. పాలించు అనే విధానం వస్తుందని పలువురు లీడర్లు భావిస్తున్నారు. అటు బండి సంజయ్. ఈటల రాజేందర్ ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో విబేధాలు వచ్చే చాన్స్ ఉంది. అయితే బీజేపీ అధిష్ఠానం మాత్రం బీసీ నేత కావడంతో ఈటల వైపు కాస్త మొగ్గు చూపుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ ము ఖ్యమంత్రిగా బీసీని చేస్తామని బీజేపీ ప్రకటించింది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమించాలని అధిష్టానం అనుకుంటే ఈటలకు అవకాశం దక్కనుంది.

క్రమశిక్షణ గల పార్టీలో గ్రూపులు
సహజంగా బీజేపీని క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతుంటారు. ఆ పార్టీలోని కార్యకర్తలూ అలాగే ఉంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఈ క్రమశిక్షణ లోపించినట్టు తెలుస్తోంది. ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టుగా నేతలు వ్యవహ రిస్తున్నారు. బీజేపీకి ఓట్లు వేసే ప్రజలున్నా.. కేడర్ ఉన్నా. నడిపించే లీడర్ మాత్రం కరువయ్యారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి కొత్త సారథిగా ఎవరు ఉండబోతున్నారు? ఈటలకు అవకాశం ఇస్తే సీనియర్లు సపోర్ట్ చేస్తారా?. లేదంటే అందరికీ ఆమో ద్యయోగ్యురాలు కాబట్టి డీకే అరుణకు చాన్స్ ఇస్తారా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img