Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డుల పై క్లారిటీ.. అప్పటినుంచే దరఖాస్తుల స్వీకరణ..!

కొత్త రేషన్ కార్డుల పై క్లారిటీ.. అప్పటినుంచే దరఖాస్తుల స్వీకరణ..!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని గతంలోనే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త రేషన్ కార్డుల అర్హతపై సస్పెన్స్ కొనసాగుతోంది. కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలను పున:సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల పై కీలక అప్డేట్ ఉంటుందని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img