రైతు భరోసాపై క్లారిటీ వచ్చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వచ్చే నెల వస్తున్న సంక్రాంతి పండుగ కానుకగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించారు. విధి, విధానాలను రాబోయే శాసన సభ సమావేశాలలో నిర్ణయిస్తామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు చేప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని రేవంత్ సర్కార్ కోరింది. అలాగే ఈ ఏడాది కాలంలోనే 20 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపింది.