ఘటనా స్థలం వద్ద కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ అక్కడికి చేరుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. ఘటనా స్థలం నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో ఫిరోజ్ ఖాన్‌ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరుపార్టీల నేతలు సంఘటన స్థలంలో వాగ్వాదానికి దిగారు. ఒకరికి ఒకరు బాహాబాహిగా ఆందోళనకు దిగారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.