Homeతెలంగాణసెప్టెంబర్ 1 నుంచి తరగతులు

సెప్టెంబర్ 1 నుంచి తరగతులు

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలోని పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ విడుదల ఉత్తర్వులను చేశారు. డిజిటల్, టీవీ, టీశాట్‌ వంటి నెట్‌వర్క్‌ ఛానల్​ల ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఇక ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులు తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలి. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాలకు అనుగుణంగా విద్యార్థులను తరగతులకు అనుమతించాలా వద్దా అనే విషయాన్ని త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img