ఇండియన్ సినిమాకు ఎన్నో క్లాసిక్స్‌ను అందించిన తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో 36 ఏండ్ల తర్వాత మళ్లీ ఓ సినిమా తెరకెక్కనుంది. 1987లో వీరి కలయికలో వచ్చిన ‘నాయకన్’మూవీ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. తెలుగులో ‘నాయకుడి’ పేరుతో రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసింది. నాయకన్ సినిమా ఆ ఏడాది ఇండియా తరఫు నుంచి ఆస్కార్‌కు సైతం నామినేట్ అయ్యింది. ఎన్నో అవార్డులు ఆ మూవీకి దక్కాయి. నాయకన్లో నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హాసన్ అందుకున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత మళ్లీ మణిరత్నం, కమల్ హాసన్ కలిసి పనిచేయలేదు. దాదాపు 36 ఏండ్ల తర్వాత వీరి కలయికలో మళ్లీ సినిమా రాబోతోంది. విక్రమ్ మూవీతో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కమల్.. ప్రస్తుతం ఇండియన్–2 సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. తన తర్వాతి మూవీ మణిరత్నంతో ఉంటుందని కమల్ హాసన్ శుక్రవారం అఫిషీయల్‌గా అనౌన్స్ చేశాడు. కాగా, ఈ క్రేజీ కాంబో మూవీని మేకర్స్ కన్ఫార్మ్ చేసి కమల్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌ను అందించారు. హీరో కమల్, దర్శకుడు మణిరత్నం కలిసి ఉన్న ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంతి కలిసి ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ మూవీని రెడ్ జెయింట్ ఫిలిమ్స్ సంస్థపై ఉదయనిధి స్టాలిన్ సమర్పిస్తున్నారు. ఇక ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, త్రిష, జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 7న కమల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
Classic Director Kamal Haasan’s movie after 36 years 36 ఏండ్ల తర్వాత క్లాసిక్ డైరెక్టర్‌తో Kamal Ha సినిమా
RELATED ARTICLES