Homeతెలంగాణవర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి

వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి

  • ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్
  • వచ్చే నెలలో చలో ఢిల్లీ: టి ఎమ్ ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు

ఆయా వర్గాల అభివృద్ధి దృష్ట్యా రిజర్వేషన్లను వర్గీకరించు కోవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం తెలంగాణ మాదిగ జేఏసి, టి ఎన్ ఆర్ పి ఎస్, మాదిగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు వర్గీకరణ అధికారాలు కల్పించేలా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు, వర్గీకరణకు అనుకూలమంటూ తిరిగిన బిజెపి వెంటనే పార్లమెంటులో ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రాలకు వర్గీకరణ అధికారం కల్పించాలని డిమాండ్ చేశారు.

వర్గీకరణ దిశగా తెలంగాణ మాదిగలు సమావేశమై ఏకతాటి పైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తమ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. టి ఎన్ ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ అనాదిగా మాదిగలు వర్గీకరణ ఉద్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నారని, కేంద్రం వర్గీకరణ బిల్లు కోసం చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ సమావేశంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ కొడారి దిరాన్, మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ, జెఎసి నాయకులు మల్లికార్జున్, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img