Homeజిల్లా వార్తలుపర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజించాలి: వి.జగదీశ్వర్ గౌడ్

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజించాలి: వి.జగదీశ్వర్ గౌడ్

ఇదేనిజం, శేరిలింగంపల్లి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జలకన్య ,అల్విన్ కాలనీ ఫేస్-2 కాలనీ సభ్యుల ఆధ్వర్యంలో జలకన్య కాలనీ లో గొట్టిముక్కల వెంకటేశ్వర రావుతో కలిసి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించాలనే గొప్ప సంకల్పంతో ప్లాస్టిక్‌ నివారణ చర్యలో భాగంగా మొక్కజొన్నతో తయారు చేసిన స్టార్చ్‌ బ్యాగులను వాడాలన్నారు. గణేశ్‌ నవరాత్రి వేడుకల్లో ప్రజలు మట్టి విగ్రహాలను నెలకొల్పి ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్ రావు,నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఇస్మాయిల్ పట్వారీ శశిధర్, నవీన్ రెడ్డి,రెహ్మాన్, రవి, వాసు, సంగమేష్, మౌలానా, స్వరూప్, రూబెన్, శివ, లింగం, రమేష్, ప్రభాకర్, లింగం, మహిళలు సత్తుర్ శిరీష, దుర్గ, లహరి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img