Homeబిజినెస్‌Clean To Green On Wheels : ఈ–వ్యర్ధాలను ఆర్గానిక్‌గా సేకరించడమే లక్ష్యం

Clean To Green On Wheels : ఈ–వ్యర్ధాలను ఆర్గానిక్‌గా సేకరించడమే లక్ష్యం

Clean To Green On Wheels : ఈ–వ్యర్ధాలను ఆర్గానిక్‌గా సేకరించడమే లక్ష్యం

Clean To Green On Wheels : మునిచ్‌లో  ప్రధాన కార్యాలయం కలిగి, సమగ్రమైన రివర్శ్‌ లాజిస్టిక్స్‌ పరిష్కారాలను అందించడంలో  అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న రివర్శ్‌ లాజిస్టిక్స్‌ గ్రూప్‌ (ఆర్‌ఎల్‌జీ), తమ క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం ప్రారంభించింది. 

కంపెనీ యొక్క ప్రతిష్టాత్మక ప్రచారం క్లీన్‌ టు గ్రీన్‌ (సీ2జీ)కు తాజా రూపు ఇది.

ఈ తాజా అవగాహన మరియు సేకరణ కార్యక్రమం 110 నగరాలు, 300 పట్టణాలలో జరుగనుండటంతో పాటుగా దేశవ్యాప్తంగా 40  లక్షల మంది ప్రజలను చేరుకోనుంది.

Healthy snacks : టిఫిన్​, వీటిలో అల్లం వాడితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అద్బుతం

Micro plastics in Drinking Water : మీరు తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్..

ఈ కార్యక్రమంలో భాగంగా 9  కలెక్షన్‌ వాహనాలు పలు నగరాలు, పట్టణాలలో తిరగడంతో పాటుగా 5500 మెట్రిక్‌ టన్నుల ఈ–వ్యర్థాలను సేకరించనున్నాయి.

దీనితో పాటుగా పాఠశాలలు, కార్పోరేట్‌ సంస్ధలు, బల్క్‌  వినియోగదారులు, రిటైలర్లు, రెసిడెంట్‌  వెల్ఫేర్‌ అసోసియేషన్ల నడుమ అవగాహన కార్యక్రమాలు  నిర్వహించడంతో పాటుగా ఆరోగ్య శిబిరాలనూ ఏర్పాటుచేయనున్నారు.


ఈ ప్రచారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఉత్తరాన న్యూఢిల్లీ, జమ్మూ ; తూర్పున కోల్‌కతా, గౌహతి, రాంచి ; పశ్చిమాన అహ్మదాబాద్‌  మరియు దక్షిణాన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో జరుగనుంది.

ఈ కలెక్షన్‌వాహనాలతో పాటుగా ఉన్న సిబ్బంది ఈ–వ్యర్ధాలను  వినియోగదారుల నుంచి సేకరిస్తారు.

Joint Pains : జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులకు ఈ మూలికలతో చెక్

Winter Healthy Soup : చలికాలంలో ఈ సూప్​ చాలా మంచి చేస్తుంది..

కంపెనీ యొక్క తాజా అవగాహన, కలెక్షన్‌ వ్యూహాలను గురించి ఆర్‌ఎల్‌జీ ఇండియా, మేనేజింగ్‌ డైరెక్టర్‌, రాధికా కాలియా మాట్లాడుతూ

‘‘ మహమ్మారి పలు పరిశ్రమల వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ , ఆర్‌ఎల్‌జీ వద్ద మేము స్థిరంగా ఈ–వ్యర్ధ అవగాహన కార్యక్రమాన్ని ప్రజల నడుమ నిర్వహించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం.

క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటుగా తగిన రీతిలో ఈ–వ్యర్ధాలను  నాశనం చేయడం, రోజువారీ జీవితంలో రీసైక్లింగ్‌ సాంకేతికతలను వినియోగించడాన్ని ప్రోత్సహించడం చేస్తున్నాం’’  అని అన్నారు.

Cancer To Hamsa Nandini: వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా

Fish Head Benefits : చేప త‌ల ముక్క‌లు తినే వారికే ఓ లెవ‌ల్ ప్ర‌యెజ‌నాలు

ఈ క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌  ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌, వెస్ట్‌ మారేడ్‌పల్లి, అరుణ్‌ నగర్‌ రోడ్‌ వద్ద విజయవంతంగా ఈ–వ్యర్థ సేకరణ చేయడంతో పాటుగా అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img