ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. టమాట ధరల స్థిరీకరణకు చర్యలు సిద్ధం చేశారు. టమాటా ధరలపై దృష్టి పెట్టిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ చిత్తూరు జిల్లా నుంచి టమాటలు కొని రైతు మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. 10రోజుల్లో 30టన్నుల టమాటాలను వ్యవసాయ మార్కెట్ శాఖ కొనుగోలు చేయనుంది. కొనుగోలు చేసిన టమాటాలను రాష్ట్రంలోని పలు జిల్లాల మార్కెట్లకు పంపిణీ చేయనున్నారు.