Homeహైదరాబాద్latest Newsఏలూరు, కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష..!

ఏలూరు, కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష..!

ఇదే నిజం, ఏలూరు జిల్లా: బుధవారం వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పర్యటనలో భాగంగా, ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో జరిగిన రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. బుడమేరు వాగు మొత్తం అక్రమ కట్టడాలు వలన విజయవాడ కు పెద్ద ముప్పు వాటిల్లింది అన్నారు. వాతావరణంలో అనుకోకుండా వచ్చే మార్పులు వలన మన పట్ల శాపాలుగా మారాయి. వాగులో రాత్రులు, పగలు రామానాయుడు కష్టపడి పని చేశారు. ఇంత పెద్ద విపత్తును దైర్యంగా ప్రభుత్వం ఎదుర్కొంటుంటే ఒక పక్క సిగ్గు లేని పార్టీ మాట్లాడుతుంది. దొంగ బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్ కు అడ్డుగా కొట్టుకు వొచ్చాయి. బాబాయిని చంపిన అబ్బాయి మాకు తెలియదు అని అన్నారు. బొట్లు మాకు తెలియదు అంటున్నారు. ఇలాంటి రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే మంచిది కాదు.

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గల్లీకొక రౌడీ ఉండే వాడు. 9 సంవత్సరాల పరిపాలనలో అంతం చేసాము. ఇప్పుడు నాకు ఒక సవాలుగా మారింది, రాజకీయ పార్టీ ఆఫీస్ ల పైన ఎప్పుడు దాడి చెయ్యలేదు. నా దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి బురదలోకి వచ్చాడు. 93% గెలిపించిన అందరికి ధన్యవాదములు. పొలిటికల్ గవర్నమెంట్, ఇది మేము ఇచ్చిన హమీ నెరవేర్చి మళ్ళీ మీ ముందుకు వస్తాం,
17వ తారీకు లోపల వరికి కూడా నష్ట పరిహారం అందిస్తాం. సోమవారం పోలవరం గా మార్చాను. 75%పూర్తి చేసాం. ప్రభుత్వం మారగానే పోలవరం పూర్తిగా ఆగిపోయింది. మళ్ళీ పోలవరం ప్రారంభం చేస్తాం. మనకు ముందు ముందు కూడా వొరదలు వొస్తాయి, ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. రఘు రామ్ కృష్ణ రాజ్ మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రాజకీయాలకు అంతీతంగా పరిపాలన చేస్తాం. రాజకీయ పరిపాలన కూడా చేస్తాం.

Recent

- Advertisment -spot_img