పౌరసరఫరాల శాఖ, వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో నిర్వహించిన సమీక్షకు మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు హాజరయ్యారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు సీఎంకు వివరించారు. డిమాండ్‌కు అనుగుణంగా నిత్యావసర వస్తువుల దిగుమతి, దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.