ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్ నెస్ రాలేదని…కొందరు మంత్రులు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని వార్నింగ్ ఇచ్చారు.
మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటు ఇచ్చారని, గెలిచి మంత్రిని కూడా చేశారని అన్నారు. అయినా పట్టుదల లేకపోతే ఎలా? వారికి కోపం వచ్చింది. సక్రమంగా పనిచేయకుంటే తీవ్రంగా ఆలోచిస్తామని హెచ్చరించారు. పార్టీకి ఉపయోగపడకపోతే రాజకీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో విమర్శలు ఎదుర్కొన్న కొందరు అధికారులు తీరు మార్చుకోలేదని… అలాంటి వారి వల్లే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని చంద్రబాబు అన్నారు.